ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్ కు మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఉగాండా జట్టుపై ఏకంగా 134 పరుగుల తేడాతో భారీ విజయాన్ని విండిస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. ఇక విండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో…
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పాకిస్తాన్, టీమిండియా జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాడు దాయాదులు ఢీకొట్టబోతున్నారు. ఇకపోతే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై ఎనిమిది వికెట్ల భారీ తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఇక మరోవైపు పాకిస్తాన్ అనుకొని విధంగా అమెరికా చేతిలో ఓడిపోయింది. Maldivian President…
టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఉగాండా జట్టు…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా.. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు. ఇక.. ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, గారెత్ డెలానీ…
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. ఇక.. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు వాతావరణం మరియు పిచ్ రెండూ సహాయపడతాయి.
భారత క్రికెట్లో ధోనీ శకం ప్రారంభమైన సంవత్సరం 2007. MS ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్‌ను ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి గెలుచుకుంది. ఆ సమయంలో భారత్ ఈ టోర్నీలో యువ జట్టుతో అడుగుపెట్టింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఈ టోర్నీలో విజయం సాధించింది. స్టార్ ఆటగాళ్లు లేకుండా.. భారత్ ఛాంపియన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ధోని సారథ్యంలోని యువ…
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.
విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్‌లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరుఫున ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ…