టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఉగాండా జట్టు ఘనంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉగాండా జట్టు ఆటగాళ్ళు తమ విజయాన్ని.. డ్యాన్స్ రూపంలో చూపించారు. చప్పట్లు కొడుతూ అదరగొట్టారు.
Read Also: Giraffe Attack: రెండేళ్ల చిన్నారిపై జిరాఫీ ఎటాక్.. వైరల్ వీడియో..
టీ20 ప్రపంచ కప్ 2024లో గ్రూప్ ‘C’ మ్యాచ్ జూన్ 5న గయానాలో పాపువా న్యూ గినియా- ఉగాండా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉగాండా జట్టు అద్భుత ప్రదర్శన చేసి పపువా న్యూగినియా జట్టుపై విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఉగాండా జట్టు తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఉగాండా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఈ విజయం సాధించిన సంతోషం తర్వాత ఉగాండా జట్టు ఆటగాళ్ల ముఖాల్లో సంబరం మాములుగా లేదు. ఉగాండా జట్టు తన సాంప్రదాయ శైలిలో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫీల్డ్‌లో ఉగాండా ఆటగాళ్లు చాలా భిన్నమైన రీతిలో గర్వపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని అభిమానులు బాగా లైక్ చేస్తున్నారు.
Read Also: Birthday Cake: “బర్త్ డే కేక్” తీసుకురావడం ఆలస్యమైందని భార్య, కుమారుడిపై కత్తితో దాడి..
మ్యాచ్ విషయానికొస్తే.. ఉగాండా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా జట్టు.. పపువా న్యూ గినియ జట్టు 19.1 ఓవర్లలో 77 పరుగులు చేసి ఆలౌటైంది. 78 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా జట్టు 3 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.