Shoib Akthar: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడటంతో తర్వాతి మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గెలిచినా సెమీస్ అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. పాకిస్థాన్ దాదాపుగా ఇంటికి వెళ్లినట్లే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌పై ఆ దేశ మాజీ…
Ravichandran Ashwin: గత ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టడంతో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి ఓవర్‌లో ఐదో బంతిని అశ్విన్ ఆడకుండా వదిలేయడంతో అది వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ బంతి మలుపు తిరిగి ప్యాడ్లను తాకి…
Worst Record: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. బాబర్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. టీమిండియాతో మ్యాచ్ పక్కన పెడితే జింబాబ్వే లాంటి జట్టుపైనా ఓడటం ఆ జట్టు మానసిక పరిస్థితిని బహిర్గతం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ జట్టుపై మాటల తూటాలతో పాటు సెటైర్లు పేలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు పాకిస్థాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా నెగ్గలేదు.…
AUS Vs ENG: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే వరుణుడి వల్ల మూడు మ్యాచ్‌లు వాష్ అవుట్ కాగా శుక్రవారం వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వర్షం తగ్గినా మైదానం పూర్తిగా తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సికిందర్ రజా ఈ ఏడాది ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్ జట్టును జింబాబ్వే ఓడించింది. పెర్త్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చారిత్రక విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో బాగానే ఆడిన జింబాబ్వే అనంతరం పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రోహిత్ సత్తా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానానికి చేరాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ పేరిట ఉండేది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ 34 సిక్సర్లు కొట్టగా…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నెదర్లాండ్స్ ఫీల్డర్లు రెండు సార్లు రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేశారు.…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కరోనా కారణంగా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కాగా ఇప్పుడు స్టార్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. బుధవారం సాయంత్రం మాథ్యూ వేడ్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు తదుపరి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా…