T20 World Cup: పెర్త్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెచ్చిపోయింది. తన పేస్ అటాక్‌ను టీమిండియాకు రుచిచూపించింది. దీంతో భారత బ్యాటర్లు అల్లాడిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికా పేసర్లకు దాసోహం అయిపోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 9 పరుగులకే అతడు అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో హాఫ్…
IND Vs SA: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ముచ్చటగా మూడో సమరానికి సన్నద్ధమైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టాస్ గెలిచిన టీమిండియా మ్యాచ్‌లను కూడా గెలుచుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో…
T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు పాకిస్థాన్ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం పెర్త్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల విజయ లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఈ మెగా టోర్నీలో బోణీ చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఛేదనలో కీలకపాత్ర పోషించాడు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో హాఫ్ సెంచరీకి ఒక్క…
Roger Binny: బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరడం కష్టమేనని రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో గ్రూప్‌లో టాప్-2లో పాకిస్థాన్ నిలవడం కష్టమేనని రోజర్ బిన్నీ అన్నాడు. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో జూనియర్ జట్లు బలంగా ముందుకు వస్తుండడం మంచిదేనని తెలిపాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, జింబాబ్వే…
టీ-20 ప్రపంచ కప్ సూపర్ -15 గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో ఎట్టకేలకు బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి, పసికూన జట్టు నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి మంచి జోరు మీదున్న టీమిండియాకు గట్టి పోటీ ఎదురైంది. రోహిత్ సేన ఆదివారం కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్‌లోని మిగతా జట్లలో అత్యంత బలమైన దక్షిణాఫ్రికాను టీమిండియా ఇవాళ ఢీకొంటోంది.
Gautham Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ ఎప్పుడు చూసినా విరాట్ కోహ్లీ టార్గెట్‌గా కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా అతడు మరోసారి కోహ్లీపై తన అక్కసు వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న కోహ్లీని చూసి సహించలేక తన నోటికి పనిచెప్పాడు. విరాట్ కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరని గంభీర్ అభిప్రాయపడ్డాడు. దీనికి కారణాలను కూడా విశ్లేషించాడు.…
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. కివీస్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ టార్గెట్‌ను ఛేదించేలా కనిపించలేదు. వరుస వికెట్లు కోల్పోతూ 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో రాజపక్స 34, శనక 35 పరుగులు చేశారు. వీరిద్దరూ తప్ప మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు.…
IND Vs SA: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. టీమిండియా మంచి ప్రదర్శనే చేస్తున్నా ఓపెనర్ రాహుల్ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో ఆదివారం ఆడనున్న మ్యాచ్‌లో అతడి స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్…
NZ Vs SL: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీలో రెండో సెంచరీ నమోదైంది. ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాడు రోసౌ బంగ్లాదేశ్‌పై మెరుపు సెంచరీ చేయగా తాజాగా శ్రీలంకపై న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ బాదాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఫిలిప్స్ సెంచరీతో ఆదుకున్నాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో…