టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 భారీ స్కోరును చేసింది.
T20 World Cup: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. మళ్లీ మునుపటి కోహ్లీ కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ భారత్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన…
T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే గ్రూప్-2లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తాజాగా గ్రూప్-1లో న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బాల్ కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో రెండు మ్యాచ్‌లు చేరాయి. ఇప్పటివరకు టోర్నీలో సూపర్-12…
T20 World Cup: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి ఇస్తారని వస్తున్న వార్తలపై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా ఫిట్‌గానే ఉన్నాడని.. తదుపరి మ్యాచ్‌కు అతడికి విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. తాము ఎవ్వరికీ విశ్రాంతి ఇవ్వాలని కోరుకోవడం లేదని.. టీ20 ప్రపంచకప్‌లో ఇంకా మరింత ముందుకు వెళ్లే అనుకూలత తమకు ఉందన్నాడు. ఆటగాళ్లందరూ ఫామ్‌లోకి రావాల్సి ఉందని బౌలింగ్ కోచ్ పరాస్…
టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
IND Vs PAK: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు అతి పెద్ద సమరం జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరోదానికి లేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్ష మంది అభిమానులు మెల్‌బోర్న్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన షమీని రోహిత్ జట్టులోకి తీసుకున్నాడు.…
T20 World Cup: హోబర్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (34), హ్యారీ టెక్టార్ (45) రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నె, ధనుంజయ డిసిల్వ…
Team India: మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అక్టోబర్‌లో మ్యాచ్‌లు అంటే కోహ్లీకి పూనకం వస్తుందని.. ముఖ్యంగా 2011 నుంచి 2021 వరకు అక్టోబర్ 21-24 మధ్య తేదీల్లో టీమిండియా మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు మ్యాచ్ జరిగే తేదీ అక్టోబర్ 23 కాబట్టి తమ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఇటీవల…
IND Vs PAK: మెల్‌బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో స్టేడియం పరిసరాల్లో సందడి నెలకొంది. దాయాదుల మహాసమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారు. భారత జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం పడకపోవడంతో భారత్ అభిమానులు ఖుషీలో ఉన్నారు. ఈరోజు వరుణుడు పక్క దేశాలకు వెళ్లిపోవాలని ప్రార్థిస్తు్న్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి టోర్నీలో శుభారంభం ఇవ్వానలి కోరుకుంటున్నారు.…
Ind Vs Pak: కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో దాయాది దేశాలు పోటీ పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తే వచ్చే మజానే వేరు. ఈ ప్రపంచకప్‌కే ఈ మ్యాచ్ హైలెట్ అని ముందు నుంచి ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ మ్యాచ్‌ను చూసే మెల్ బోర్న్ స్టేడియంలో సీట్ల సామర్థ్యం 90వేలు అయితే అమ్ముడుపోయిన టిక్కెట్లు లక్ష…