సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు.
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరకాసేపట్లో సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకోనున్నారు. అతి సమీపంలో తిరుగుబాటుదారులు ఉన్నారు. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని డమాస్కస్ స్వాధీనం చేసుకుంటే సిరియా దేశం రెబల్స్ హస్తగతం అయినట్లే.
ఇస్లామిక్ దేశం సిరియాలో అధికారం కోసం మళ్లీ హింస చెలరేగింది. ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) గత వారం అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, సైన్యంపై దాడి చేసింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హెచ్‌టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగుతున్నాయి. దీని తరువాత.. సిరియాలో ఉద్రిక్తత పెరిగింది. హిట్‌ఎస్ దాడి కారణంగా.. ప్రభుత్వ సైన్యం కూడా వెనక్కి తగ్గింది. ఈ దాడి తర్వాత దాదాపు 14 ఏళ్లుగా…
ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు రష్యా సైన్యం సిరియాలో భీకర పోరు సాగించాల్సి వచ్చింది. అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత, హయత్ తహ్రీర్ అల్-షామ్ అంటే హెచ్‌టీఎస్(HTS) తిరుగుబాటుదారులు వ్యూహాత్మక నగరం హమా వైపు కదులుతున్నారు. సిరియాలోని హమా ప్రావిన్స్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నాయి.
Syria Crisis: మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్-హమాస్-హిజ్బుల్లా-ఇరాన్ వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉంటే, తాజాగా సిరియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై తిరుగుబాటుదారులు పైచేయి సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధాని డమాస్కస్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న అలెప్పోపై రెబల్స్ పట్టుసాధించారు. ఇప్పుడు రాజధాని డమాస్కస్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అలెప్పోకి దారి తీసే అన్ని రహదారుల్ని, సమీప ప్రాంతాలన్ని రెబల్స్ ఆక్రమించారు. అల్ ఖైదా…
హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.
America – Syria: సిరియాలో జరిగిన భారీ వైమానిక దాడిలో ISIS, అల్ ఖైదాతో సంబంధం ఉన్న సాయుధ యోధులు సహా 37 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది. ఈ నెల 2 వేర్వేరు రోజుల్లో ఈ దాడి జరిగింది. సెప్టెంబర్ 16న సెంట్రల్ సిరియాలో, సెప్టెంబరు 24న వాయువ్య సిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, హత్యకు గురైన వారి…
మానవతా దృక్పథంతో భారతదేశం సుమారు 1400 కిలోల క్యాన్సర్ నిరోధక మందులను సిరియాకు పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియా పట్ల దేశం కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని, డ్రగ్స్ భారతదేశం నుండి పంపబడతాయి.