సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు బెదిరిస్తున్న వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో “సిరియా ఓ సమస్యాత్మక దేశం. అది మన మిత్ర దేశం కాదు. దీనితో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఈ పోరాటానికి మనకు సంబంధం లేదు. ఇందులో జోక్యం చేసుకోకండి.” అని తెలిపారు. రష్యా ఇప్పటివరకు సిరియా ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారుగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ రష్యా కూడా అసద్ ప్రభుత్వాన్ని రక్షించలేక పోతుందని తెలిపారు. ఈ ఘర్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా తలదూర్చకూడదని స్పష్టం చేశారు.
READ MORE: KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాలపై చర్చ..
ఇదిలా ఉంటే తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు హిజ్బుల్లాకు చెందిన 2,000 మంది యోధులను లెబనాన్ సిరియాకు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిరియాలోని క్యుసైర్ ప్రాంతానికి యోధులను పంపినట్లు సమాచారం. సిరియాలో హిజ్బుల్లా తన స్థానాలను కాపాడుకోవడానికి యోధులను పంపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిరియన్ తిరుగుబాటుదారులతో ఇంకా ఎటువంటి యుద్ధాల్లో పాల్గొనలేదని సమాచారం. ఇదిలా ఉంటే సాయుధ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇరాన్-మద్దతుగల ఇరాకీ మిలీషియాలు కూడా సిరియాలో మోహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు డమాస్కస్ సరిహద్దుల్లోంచి సైన్యం పారిపోయినట్లుగా వస్తున్న వార్తలను సిరియా రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలను కొట్టిపారేసింది.
READ MORE: War 2 : వార్ 2 క్లైమాక్స్ లో స్టార్ హీరో ? థియేటర్ల బద్ధలు కావల్సిందే ?