ఇస్లామిక్ దేశం సిరియాలో అధికారం కోసం మళ్లీ హింస చెలరేగింది. ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) గత వారం అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, సైన్యంపై దాడి చేసింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హెచ్‌టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగుతున్నాయి. దీని తరువాత.. సిరియాలో ఉద్రిక్తత పెరిగింది. హిట్‌ఎస్ దాడి కారణంగా.. ప్రభుత్వ సైన్యం కూడా వెనక్కి తగ్గింది. ఈ దాడి తర్వాత దాదాపు 14 ఏళ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులు తారుమారయ్యాయి.
READ MORE: CM Revanth Reddy: నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
ఇస్లామిక్ దేశంలో హింస చెలరేగిన తర్వాత.. భారత ప్రభుత్వం భారతీయ పౌరులకు ప్రయాణ సలహా జారీ చేసింది.
సిరియాలో హింస, అశాంతి దృష్ట్యా ప్రయాణాలకు దూరంగా ఉండాలని పౌరులందరినీ కోరుతూ భారత ప్రభుత్వం శుక్రవారం ఒక సలహా జారీ చేసింది. సిరియాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయులు సిరియాకు వెళ్లకూడదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సూచించింది.
READ MORE:CM Chandrababu : నేడు బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన…
సిరియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఒంటరిగా ఉన్న భారతీయులను వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా అక్కడి నుంచి బయలుదేరాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఇది కాకుండా.. భారతీయ పౌరుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ఐడి జారీ చేసింది. ఏమైనా సమస్యలు ఏర్పడితే.. డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.
READ MORE:BJP Poru Sabha: నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా
“సిరియాలో ఉన్న భారతీయులకు ఏమైనా సాయం కావాలంటే.. డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీ యొక్క ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌ను +963 993385973ను సంప్రదించండి. వాట్సప్‌లో కూడా సంప్రదించవచ్చు. లేదా ఇమెయిల్ ఐడి hoc.damascus@mea.gov.inలో సంప్రదించవలసిందిగా ఎమ్‌ఈఏ అభ్యర్థించింది. ఈ పరిస్థితిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “ఉత్తర సిరియాలో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. సిరియాలో దాదాపు 90 మంది భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో 14 మంది వివిధ యూఎన్ సంస్థల్లో పనిచేస్తున్నారు. మేము వారితో టచ్‌లో ఉన్నాం” అని పేర్కొన్నారు.