సిరియా తూర్పు ప్రాంతంలో సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు జరిపిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సన్ అల్ ఖురాషి సిరియాలో చనిపోయినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆరపరేషన్ లో హతమయ్యినట్లు పేర్కొన్నారు.
సిరియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని హమా ప్రాంతంలో పుట్టగొడుగులను తీయడానికి వెళ్లిన 31 మందిని చంపింది. బ్రిటన్‌లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా నలుగురు గొర్రెల కాపరులను చంపి, ఇద్దరు జిహాదీలను కిడ్నాప్ చేసింది.
Israel: ఇజ్రాయిల్ వరస దాడులతో అట్టుడుకుతోంది. సరిహద్దు దేశాల నుంచి వరసగా రాకెట్ దాడులను ఎదుర్కొంటోంది. జెరూసలెం అల్-అక్సా మసీదు ఘటన తర్వాత నుంచి పాలస్తీనా, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిరియా నుంచి రాకెట్ దాడులు జరిగాయి.
టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
37 earthquakes strike Central Turkey in 66 hours: టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత…
Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది.
Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.