SMAT 2025:పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్-A మ్యాచ్‌లో ఝార్ఖండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో మధ్యప్రదేశ్‌ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగగ.. యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రా కీలక చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు గుర్తుండిపోయే విజయం అందించాడు. ఈ గెలుపుతో ఝార్ఖండ్ టోర్నీలో వరుసగా 9వ విజయాన్ని నమోదు…
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్-A మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పంజాబ్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (డిసెంబర్ 14) పూణే వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంధ్రకు మారంరెడ్డి హేమంత్ రెడ్డి అసాధారణ ఇన్నింగ్స్‌తో తొలి విజయాన్ని అందించాడు. కేవలం తన రెండవ SMAT మ్యాచ్ ఆడుతున్న 23 ఏళ్ల…
Sarfaraz Khan: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపాడు ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్–B మ్యాచ్‌లో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరకు అతడు 25 బంతుల్లో 64 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 9 ఫోర్లు, 3 సిక్సులు బాదుతూ…
మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను (6/9) నమోదు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో గతంలో టి రవితేజ (హైదరాబాద్), అర్జన్ నాగవాసల్లా (గుజరాత్) నెలకొల్పిన రికార్డు (6/13) బ్రేక్ అయింది. సంచలన బౌలింగ్ చేసిన అర్షద్ ఖాన్‌పై ప్రశంసల…
భారత ఓపెనింగ్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్, సర్వీసెస్ మధ్య జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2025-26 మ్యాచ్‌లలో భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా…
Shivam Dube – SKY: నేడు (డిసెంబర్ 3)న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, సర్వీసెస్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై 39 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. ఒకవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, దూబే కేవలం 37 బంతుల్లో 71 పరుగులతో…
గుజరాత్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో వారం వ్యవధిలోనే మరో సెంచరీ సాధించాడు. మంగళవారం ఉత్తరాఖండ్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాదాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పటేల్ 41 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేశాడు.
Sanju Samson in syed mushtaq ali trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్‌పై కేరళ కెప్టెన్ సంజు చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో కేరళ విజయం సాధించింది. కేరళ, సర్వీసెస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. సర్వీసెస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కేరళ 18.1 ఓవర్లలో…
Hardik Pandya syed mushtaq ali trophy: హార్దిక్ పాండ్యా ఎక్కడికి వెళ్లినా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మైదానం ఏదయినా, ప్రత్యర్థి ఎవరన్నా పట్టించుకోని పాండ్యా కేవలం తన జట్టును గెలిపించుకోవడంపైనే దృష్టి సారించాడు. మరోసారి పాండ్యా అదే చేశాడు. 8 ఏళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లోనే అద్భుతం చేశాడు. పాండ్యా అజేయ అర్ధ సెంచరీతో తన జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. బరోడా తరఫున…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగించింది. రాబోయే సీజన్లో ఈ నిబంధనను రద్దు చేయనున్నట్లు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 15న జరుగుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రయోగాత్మకంగా ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీసీసీఐ…