SMAT 2025:పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్-A మ్యాచ్‌లో ఝార్ఖండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో మధ్యప్రదేశ్‌ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగగ.. యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రా కీలక చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు గుర్తుండిపోయే విజయం అందించాడు. ఈ గెలుపుతో ఝార్ఖండ్ టోర్నీలో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు ఝార్ఖండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవకవడం గమనార్హం.
Syed Mushtaq Ali Trophy: ఉత్కంఠ పోరులో ఆంధ్ర జట్టు సంచలన విజయం.. మరోసారి నిరాశపరిచిన నితీష్ రెడ్డి..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఝార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన జట్టు.. ఇషాన్ కిషన్ కేవలం 30 బంతుల్లో 63 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా అనుకుల్ రాయ్ 29 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు 20 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. దీనితో జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
SBI వినియోగదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి తగ్గనున్న హోమ్ లోన్స్ EMIలు..!
ఇక లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ కు మంచి ఆరంభం లభించింది. హర్ష్ గావ్లీ 49 బంతుల్లో 61 పరుగులు చేయగా, హర్ప్రీత్ సింగ్ భాటియా అజేయంగా 48 బంతుల్లో 77 పరుగులు సాధించి చివరి వరకు పోరాడాడు. ఇక చివరి 6 బంతుల్లో మధ్యప్రదేశ్ విజయం కోసం 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ బాధ్యత తీసుకున్న సుశాంత్ మిశ్రా ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్ తొలి బంతికి రజత్ పాటీదార్ ఫోర్ కొట్టినా, ఆ తర్వాత మిశ్రా మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఒక వైడ్, ఒక నో బాల్ వేసినా కీలక సమయంలో పాటీదార్ వికెట్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన సమయంలో అద్భుత యార్కర్‌తో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఝార్ఖండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Jharkhand Win 🙌
Last over drama. What a thriller 🔥
Sushant Mishra holds nerve to defend 13 off the last over to win it for Jharkhand against Madhya Pradesh 🧊
Relive the full final over 📽️ ⬇️
Scorecard ▶️https://t.co/5O1y8fDfJc#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/CsIgFx2aGo
— BCCI Domestic (@BCCIdomestic) December 14, 2025
Jharkhand chased 237 runs in just 18.1 overs against Punjab in SMAT 🥶
Ishan Kishan – 47 (23)
Virat Singh – 18 (7)
Kushagra – 86 (42)
Anukul Roy – 37 (17)
Pankaj – 39 (18)Pure team performance 🫡
Don't forget Sahil's knock of 125 runs for Punjab 🔥pic.twitter.com/GuvSbNOM0a
— Tejash (@Tejashyyyyy) December 12, 2025