Sanju Samson in syed mushtaq ali trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్‌పై కేరళ కెప్టెన్ సంజు చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో కేరళ విజయం సాధించింది. కేరళ, సర్వీసెస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. సర్వీసెస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కేరళ 18.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సంజు అర్ధసెంచరీకి తోడు రోహన్ ఎస్.కున్నుమ్మల్ 27 పరుగులు చేసి అద్భుతమైన సహకారం అందించాడు.
Also Read: Hardik Pandya: 8 ఏళ్ల తర్వాత మరోసారి రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా
లక్ష్య ఛేదనలో 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 18.1 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేరళ తరఫున సంజు శాంసన్ 45 బంతుల్లో 3 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేరళ తరఫున అఖిల్ సకారియా సర్వీసెస్‌పై 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు మోహిత్ అహల్వత్ (29 బంతుల్లో 41), అరుణ్ కుమార్ (22 బంతుల్లో 28) రాణించడంతో సర్వీసెస్ 149 పరుగులకు చేరుకుంది. కేరళ బౌలర్స్ లో అఖిల్ సకారియా 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. నిధీష్ రెండు వికెట్లు తీశాడు.
Also Read: Women Kidnap On Road: పట్టపగలు మహిళ కిడ్నాప్.. ఆటోలో నుంచి ఈడ్చుకెళ్లి కారులోకి (వీడియో)
New shirt name whu dis 😍🔥 pic.twitter.com/mAlS2MvHyz
— Rajasthan Royals (@rajasthanroyals) November 23, 2024
ఇకపోతే, ఈ విజయం కంటే సంజూ శాంసన్ కొత్త పేరు హెడ్ లైన్స్ లో నిలిచిపోయింది. సంజూ శాంసన్ తన జెర్సీపై కొత్త పేరును ఉంచాడు. ఇందుకు సంబంధించిన ఫోటో రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా ఖాతా నుండి భాగస్వామ్యం చేయబడింది. సంజూ శాంసన్‌కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. శాంసన్ సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జెర్సీ వెనుక స్యామీ అని రాసి ఉన్న జెర్సీని ధరించి కనిపించాడు. సంజు శాంసన్ సాధారణంగా సంజు పేరుతో ఆడతాడు. కానీ, ఇప్పుడు తన పేరు మార్చడం కనిపించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌ల కోసమే అతను ఇలా చేసి ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.