సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ నిరీక్షణకు ముగింపు పలకనున్నారు మహేష్ టీం. ఈ వారం మహేష్ బాబు అభిమానులకు పండగ కానుంది. వరుస అప్డేట్లతో సందడి చేయనున్నారు “సర్కారు వారి పాట” బృందం. ఈ ఏడాది ప్రేమికుల రోజున “సర్కారు వారి పాట” నుండి మొదటి…
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనుకుంటున్నట్టుగానే తాజాగా “సర్కారు వారి పాట” నుంచి అప్డేట్ వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ “సర్కారు వారి పాట” చిత్రం నుండి మొదటి పాటను ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.…