సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ నిరీక్షణకు ముగింపు పలకనున్నారు మహేష్ టీం. ఈ వారం మహేష్ బాబు అభిమానులకు పండగ కానుంది. వరుస అప్డేట్లతో సందడి చేయనున్నారు “సర్కారు వారి పాట” బృందం. ఈ ఏడాది ప్రేమికుల రోజున “సర్కారు వారి పాట” నుండి మొదటి సింగిల్‌ని విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
ఇప్పుడు రాబోయే రోజుల్లో వరుస అప్‌డేట్‌ల వర్షం కురుస్తుందని “సర్కారు వారి పాట” టీమ్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఈరోజు నుండి, థమన్ కంపోజ్ చేసిన మొదటి సింగిల్ గురించి ఫిబ్రవరి 7, 9, 11, 14 తేదీల్లో ప్రధాన అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో విడుదల కానున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందాల సుందరి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#SVPFirstSingle updates on
— Guntur Kaaram (@GunturKaaram) February 7, 2022
Feb 7
Feb 9
Feb 11
Feb 14#SarkaruVaariPaata is going to be @MusicThaman's Super Album for our SuperStar @urstrulyMahesh ❤️@KeerthyOfficial @ParasuramPetla @GMBents @14ReelsPlus @MythriOfficial @saregamasouth