Fake Employee: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సీసీసీ (కంప్రెహెన్సివ్ కోఆర్డినేషన్ సెంటర్) కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు రాకపోకలు నిర్వహించడం పోలీసులను అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ అనుమానాస్పద వ్యక్తి అక్కడ తిరుగడం హాట్‌టాపిక్‌గా మారింది. సీసీసీ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తిని గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మొదట అతను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకున్నా, చివరకు ఆ ఫేక్ ఉద్యోగి జ్ఞాన…
Suspects : ఏలూరులో ముగ్గురు యువకులుతుపాకీతో పోలీసులకు పట్టుబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు తుపాకీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు, ఎలాంటి నేరానికి పాల్పడనున్నారు అనే కోణాల్లో వారిని విచారణ చేస్తున్నారు. ఏలూరు టూటౌన్ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో వారిని వివరాలు అడిగారు. వారు చెప్పిన సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో కారంతా గాలించగాతుపాకీ దొరికింది. వెంటనే ఆ…
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.