తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు…
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్…
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. విద్యార్థినులు వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది. Corona Updates : కర్ణాటకలో మళ్లీ కరోనా కలవరం.. అయితే ఈ ఏడాది మార్చిలో హిజాబ్‌పై కర్ణాటక…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించిన వారిపై వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడమే కాకుండా మండల పంచాయతీ అధికారిపై బదిలీ చేశారు ఆమె. పల్లెప్రగతి పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. పల్లె ప్రగతి పనుల్లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో నిర్లక్ష్యం వహించిన పూడూరు మండలం, చింతల్‌పల్లి పంచాయతీ కార్యదర్శి హమీద్, గొంగుపల్లి…
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి సీఎం జగన్ షాకిచ్చారు. ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేయడంతో కొత్తపల్లిని జగన్ సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తనకు ఓట్లు పడతాయని మంగళవారం నాడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ ప్రకటించకుండా తాను వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.…
కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. Konaseema: కోనసీమలో మళ్లీ మొదలైన టెన్షన్.. షాపులన్నీ క్లోజ్ అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను…
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్లు భావించొచ్చు. కాగా టీడీపీ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారనే ఆరోపణల…
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నున్న పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు విధించారు. తమ కుమార్తె కనిపించలేదన్న బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం…
ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్ని తీసుకెళ్లిన ఉదంతంపై చర్యలు చేపట్టారు. వాహనాలను ఆపిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కుటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ సీఎం జగన్ పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ వాహనాన్ని,…