అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటసొమ్ము చెల్లింపుల అక్రమాలపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తీవ్రంగా స్పందించారు. రావులపాలెం(మ)దేవరపల్లిలో రైతుల పంట సొమ్ము అక్రమాలపై స్పందించిన కలెక్టర్ హిమాన్సుశుక్లా విచారణకు ఆదేశించారు. 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 జమ అయిన సొమ్మును వెంటనే రికవరీ చేయాలంటూ రావులపాలెం తహసీల్దార్ కు ఆదేశాలు జారీచేశారు. దేవరపల్లి లో ఈకెవైసి చేయకుండా 37 మంది 2కోట్ల 70 లక్షలు ధాన్యం సొమ్ము మంజూరు అయింది.
దీంతో 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 జమ అయింది. మరో12మంది ఖాతాల్లో నగదు నిలుపుదల చేశారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లారావులపాలెం మండలం దేవరపల్లిలో రైతుల పంట సొమ్ము అక్రమాలపై కలెక్టర్ హిమాన్సుశుక్లా స్పందించారు. రావులపాలెం మండలం దేవరపల్లిలో రైతుల పంట కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పంట నమోదు చేసి కొందరు రైతుల పేరునే మొత్తం భూమిని నమోదు చేసి దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసుకొనేందుకు సహకరించారని అధికారుల విచారణలో తేలింది. దీంతో గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎస్ కె ఇసాద్ వలీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2కోట్ల 70 లక్షల పంటల కొనుగోలు సొమ్ము కొందరి రైతుల ఖాతాల్లో మాత్రమే జమ చేశారు.
37 మంది రైతుల ఖాతాల్లో మొత్తంగా నగదు జమ జరిగింది. ఇప్పటికే 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 లక్షల రూపాయలు నగదు విత్ డ్రా కాగా మిగిలిన 17మంది ఖాతాల్లో జమ అయిన నగదును అధికారులు నిలుపుదల చేశారు.దేవరపల్లి గ్రామ 2 ఆర్ బికె సెంటర్ లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రైతు భరోసా కేంద్రం పరిధిలో సాగు చేసే రైతుల మొత్తం పంట నమోదు చేయకుండా ఆ మొత్తం భూమిని కొంత మంది పేరున నమోదు చేసారు. దీంతో ఒక్కో రైతు ఖాతాలో పది లక్షల నగదు పడటంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేయగా రైతుల పంట నమోదు జరగని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కోనసీమ కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత విఎఎ వలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మిగిలిన అధికారుల పాత్ర ఏదైనా ఉందనేది దానిపై కూడా విచారణ చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటికే మూడు చోట్ల ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రైతుల ఖాతాల్లో జమ అయిన నిధులను రికవరీ చేయాలని కలెక్టరేట్ ఆదేశించడంతో రావులపాలెం తహశీల్దార్ వెంటనే చర్యలు చేపట్టారు.
Read Also: Jagadish Reddy : మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలే