సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును కూడా బాధ్యుడిగా గుర్తించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు స్థానంలో చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం నిత్యం జరుగుతోంది.. ఇక, ఇవాళ కూడా జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.. అయిలే, మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కానీ, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు…
తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతు పూజలు, గ్రహణాల సమయంలోనూ తెరిచి వుండే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అవకతవకలు జరగడంతో ఈవో పెద్దిరాజు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆలయములో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి ఛార్జి మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈఓ పెద్దిరాజు. రాహు కేతు పూజలకు సరైన సమయానికి నాగ పడగలు…
ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి…
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏపీలో రెవిన్యూ అధికారుల అవినీతి జాడలు వెలుగులోకి వస్తున్నాయి. పొదలకూరు పూర్వ తహసీల్దారు స్వాతి అవినీతి పై రెగ్యులర్ విచారణకి ఆదేశించారు ఏసీబీ డైరెక్టర్ జనరల్. ట్రైనీ తహసీల్దారు గా వచ్చి కోట్లాది రూపాయల అవినీతి ,అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు విచారణాధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్వాతి అక్రమాలను విచారించి, అవి నిజమేనని నిగ్గు తేలటంతో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏసీబీ రెగ్యులర్ విచారణలో మరిన్ని మైండ్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండల తహసీల్దార్ దయాకర్ రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత నాలుగు నెలలుగా ప్రతిరోజూ రాత్రిపూట ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో బాధిత మహిళ ఈనెల 8న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. Read Also: జగన్ పాలన అద్భుతం.. మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది: నటుడు అలీ తహసీల్దార్ దయాకర్‌రెడ్డి నిజంగానే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని…
ఏపీ ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు.. ఒక అసిస్టెంట్ సెక్రెటరిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్న డి. శ్రీనిబాబు, కే. వర ప్రసాదులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేస్తున్న నాగులపాటి వెంకటేశ్వర్లుని కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే ఈ ముగ్గురు ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని భావించిన ప్రభుత్వం ఏ నిర్ణయం…
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పిన సర్కార్.. లాక్ డౌన్ ముగియగానే ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు అంటోంది. ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలు, ఫలితాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జులై రెండో వారంలో పరీక్ష సమయం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తామని…