సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం…
సూర్యాపేట వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో…ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేశారు. సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జె.మహేందర్, జి.శశాంక్,…
వృత్తిరీత్యా అతనో టెక్కీ, కానీ కరోనా దెబ్బకు ప్రముఖ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తీసుకురావడంతో చాలా మంది తాము చేస్తున్న పనులకు అదనంగా కొత్త దారుల వెంట పయనిస్తున్నారు. ఈ కోవలోకే వస్తాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పదిరి మాధవ రెడ్డి. వ్యవసాయంపై మక్కువతో ఆధునిక సాగుతో లాభదాయకమైన పంటలను వినూత్న పద్ధతులతో పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు..సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌కు చెందిన పదిరి మాధవరెడ్డి. ఈ కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పని…
తల్లి తండ్రి గురువు దైవం అని పెద్దలు అంటారు.. తల్లితండ్రులు తర్వాత దేవుడి కన్నా ఎక్కువగా గురువును నమ్ముతారు పిల్లలు. కానీ అలాంటి గురువులే నీచానికి ఒడిగడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు విద్యార్థులను ఉన్నత స్థాయికిఎదిగేలా చేయాల్సింది పోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆటల పేరుతో ఆడపిల్లలపై లైంగికదాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చింతలపాలెం మండలం తమ్మారం ప్రైమరీ స్కూల్లో…
సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోదాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 15 ఏళ్లుగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతికి పాల్పడ్డ ఉత్తమ్‌కు నీతి గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. మద్యం సిండికేట్‌లో ప్రతి క్వార్టర్ సీసాపై తనకు కమీషన్ వస్తుందని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే…
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు కాలి బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మంటల్లో కాలిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నేలమర్రి గ్రామానికి చెందిన సన్నకారు రైతు కప్పల లక్ష్మయ్యకు రెండు ఎకరాల పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం తన తండ్రికి చెందిన ఆస్తి అమ్మడంతో…
రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి కుటుంబాన్ని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని మనస్తాపంతో నీలకంఠ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన నాగిరెడ్డి…వైఎస్సార్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుండి షర్మిల బయలుదేరనున్నారు. కాగా…