కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం అని ఆయన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీకి ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతనే అనేది గుర్తు పెట్టుకోవాలి.. కుంభకోణాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. మోడీ దయా దాక్షిణ్యల మీద బతుకుతుంది గాంధీ కుటుంబం అని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం.. భారత వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి..
బోఫోర్స్ కేసులో పీకల లోతు కూరుకు పోయిన చరిత్ర గాంధీ కుటుంబానిది అంటూ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో అటువైపు చూడకపోవడమే కాంగ్రెస్, బీజేపీల లాలూచీ రాజకీయాలకు నిదర్శనం.. తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే నోటికి వచ్చిన అబద్ధాలు కాంగ్రెసోళ్లు చెబుతున్నారు.. ఇంతకీ, కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ లేదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ బ్రతుకు నాశనం అయింది అని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: leo movie review: లియో మూవీ రివ్యూ
లక్ష కోట్ల అవినీతి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే.. కేసీఆర్ వల్లే తెలంగాణ ససశ్యామలం.. పగటి దొంగలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి రాహుల్ అభాసుపాలు అయ్యాడు.. ఏ యాత్రను చివరి వరకు ముంగించిన చరిత్ర రాహుల్ గాంధీకి లేదు అంటూ జగదీష్ రెడ్డి విమర్శించారు. ఏ యాత్రలు బీఆర్ఎస్ జైత్రయాత్రను అపలేవు.. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం అంటూ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.