Suryapet: దారుణం.. గురుకుల హాస్టల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం వెలుగు చూసింది.
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న, జయలక్ష్మి దంపతుల కుమారుడు రాకేష్ (16) మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం బాలుడు 9వ తరగతి చదువుతున్నాఉ. హాస్టల్‌లో చదువుతున్న రాజేష్ బుధవారం రాత్రి హాస్టల్‌లోని పాత మరుగుదొడ్ల సమీపంలోని రేకుల షెడ్డుకు ఉరివేసుకుని మృతి చెందాడు. గురువారం తెల్లవారు జామున తోటి విద్యార్థులు చూసి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. అయితే రాకేష్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరివేసుకోవడం చూసిన తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదని, కాళ్లు నేలపైనే ఉన్నాయని ఆరోపించారు. అయితే.. గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం పాఠశాల వదిలి కొందరు విద్యార్థులు గ్రామాలకు వెళ్లి డప్పులు కొట్టినట్లు సమాచారం. అయితే హాస్టల్ నుంచి బయటకు వెళ్లి డప్పులు కొట్టడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ లెక్చరర్ విద్యార్థులను తీవ్రంగా మందలించాడని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు. మరికొందరు హాస్టల్ గదుల్లో అద్దెలు నిషేధించాలంటూ వార్డెన్ మందలించారని అంటున్నారు. ఈ కారణాలతోనే రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపించారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా తమ కుమారుడి హత్యను, ఆత్మహత్యగా వార్డెన్ చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా… ఈ విషయం తెలుసుకున్న పీడీఎస్ యూ, ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్ నాయకులు వచ్చి హాస్టల్ ఎదుట నిరసన తెలిపారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులను దుర్భాషలాడారని, పైపులతో కొట్టారని తెలిపారు. పాఠశాలలో ఎంతో చురుగ్గా పనిచేసే రాకేష్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాకేష్ తండ్రి శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని, తమది నిరుపేద కుటుంబమని, వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకులాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ మృతిపై విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. కాగా, గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి చెందడంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ హాస్టల్‌లో ఉండలేమని తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు పాఠశాలకు అనధికార సెలవులు ఇచ్చినట్లు సమాచారం.
Telangana Elections : తెలంగాణ హైటెక్ ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాలు..
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!