Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
- సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
- జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో జరిగే రివ్యూ కార్యక్రమానికి హాజరుకానున్న గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Jishnu Dev Varma: మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో జరిగే రివ్యూ కార్యక్రమానికి హాజరుకానున్నారు గవర్నర్. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా సూర్యాపేట చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి 11.30 గంటలకు జిల్లా అధికారులతో కలిసి ఆయా శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించనున్నారు. అనంతరం జిల్లాలోని వివిధ రంగాల్లోని రచయితలు, కవులు, కళాకారులు, అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు. అయితే సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి నేరుగా భద్రాచలం బయలుదేరి వెళతారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు.
Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు