Suryapet: సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మేళ్లచెరువులోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కాంక్రీట్ పనులు చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంటే అందరికీ చులకన భావనే ఉంటుంది. సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలేజీకి రంగులు వేయించడానికి నిధులు లేకపోవడంతో స్వయంగా ఆయనే పెయింట్ బ్రష్ చేతపట్టుకుని రంగులు వేస్తున్నారు. దీంతో నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గురువారం ఉదయం స్థానికులు హుజూర్ నగర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌కు వాకింగ్‌కు వెళ్లగా అక్కడ ఆశ్చర్యపోయే సీన్…
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. Read Also: జంటనగరాల…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌ను అడుగడునా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి టీఆర్‌ఎస్ శ్రేణులు.. దీంతో.. పలు చోట్ల టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.. ఇక, వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పోలీసులు పనిచెప్పాల్సి వచ్చింది. Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్.. అమెజాన్ ద్వారా గంజాయి..! తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల చిల్లేపల్లిలో బండి సంజయ్…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. 60 లక్షల విలువ చేసే నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని, ఆరుగురి అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి తెలంగాణకు తీసుకోవచ్చి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కాగా జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా.. మీడియా సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు.