సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బోరు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మునగాల మండలం కలుకోవా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు కొమర్రాజు లక్ష్మయ్య అనే రైతుగా గుర్తించారు. బోరు బావిలో మోటార్ను దించేందుకు లోపలి దిగడంతో ప్రమాదవశాత్తు ఊపిరి అందక మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు.