కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న చిత్రం టీజర్ను విడుదల…
ఎలాంటి విపత్తు వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటానికి ముందుకు వస్తుంటారు సూర్య బ్రదర్స్. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను చదవిస్తూ… పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా తొలి దశలోనూ ఎంతో మంది బాధితులకు సహాయం అందించిన సూర్య బ్రదర్స్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్ ను కలిసి అభినందించి కోవిడ్ బాధితులును ఆదుకోవాలంటూ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఎన్నికల్లో గెలిచిన స్టాలిన్ ను విశాల్ వంటి పలువురు చిత్రప్రముఖులు కలసి ప్రచారానికి వాడుకుంటుంటే……
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. అలనాటి ప్రముఖ నటి షీలా కుమార్తె అయిన రజిషా ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర్ణన్’తో ఈ అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చక్కని విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. దీనిని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అతని తండ్రి సురేశ్ రీమేక్ చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… రజిషా విజయన్…