Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: China: చైనాను భయపెడుతున్న జనాభా సంక్షోభం.. పిల్లల తల్లిదండ్రులకు సబ్సిడీలు..
‘‘ శరద్ పవార్ పార్టీకి చెందిన మహారాష్ట్ర నేత జితేంద్ర అవాద్ మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించే భాష ఉపయోగించారు. సనాతన ధర్మం భారతదేశాన్ని నాశనం చేసిందని, భారతదేశంలో సనాతన ధర్మం అనే మతం ఎప్పుడూ లేదని అవద్ అన్నారు. మీరు సత్యాన్ని అవమానించారు, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడారు.’’ అని సంబిత్ పాత్ర అన్నారు. ఇది మీ పార్టీ అధికార పంథానా..? అని శరద్ పవార్, సుప్రియా సూలేని ప్రశ్నించారు. సనాతన ధర్మానికి అగౌరవం కలిగించడానికి కాంగ్రెస్ ఎకో సిస్టమ్ కారణమని దుయ్యబట్టారు.
గతంలో హిందూ ఉగ్రవాది, సనాతన ఉగ్రవాది అనే పదాలను ఉపయోగించిన కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్‌పై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలో మరెక్కడా కూడా మెజారిటీ సమాజంపై దాడి చేసి, అసహనంగా తిట్టలేదని సంబిత్ పాత్ర అన్నారు. 2008 మాలేగావ్ పేలుళ్లలో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌చంద్ర పవార్ (ఎన్‌సిపి-ఎస్‌పి) శాసనసభ్యుడు అవ్హాద్ “సనాతన ధర్మం యొక్క భావజాలం వక్రీకరించబడింది మరియు అది దేశాన్ని నాశనం చేసింది” అని పేర్కొనడం వివాదంగా మారింది.