సుప్రీంకోర్టులో సోమవారం వనమాకు ఊరట లభించింది. కొత్తగూడెం బీఆర్‌ఎస్ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని జలగం వెంకట్రావు వేసిన ఎలక్షన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలిసిందే. అయితే.. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టులో అప్పీలు వేశారు. వాదనలు విన్నఅనంతరం తెలంగాణ హైకోర్టు తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో యధావిధిగా వనమా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వనమా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కష్టకాలంలో తన వెంట ఉన్న నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : PM Modi: గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ముఖ్యం
అయితే.. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రకటించింది. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ జలగం వెంకట్ రావుకి అయిన కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 12, 2018 నుంచి ఈ తీర్పు అమలులోకి వచ్చేలా కొత్తగూడెం ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థి జలగం వెంకట్‌రావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది.
Also Read : CS Jawahar Reddy: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ సమీక్ష