Supreme Court: భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులనేవి చాలా వరకు తక్కువ. ప్రతీ 100 వివాహాల్లో ఒక్కరు మాత్రమే విడాకుల వరకు వెళ్తున్నారు. హింస, క్రూరత్వం వంటి కేసుల్లో ఇటు మహిళలు, అటు పురుషులు విడాకులను కోరుతున్నారు. కోర్టు అన్ని సాక్ష్యాలను పరిశీలించి నిజం అని తేలితేనే విడాకులను మంజూరు చేస్తోంది. దంపతులు కలిసి ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చిన్న చిన్న వివాదాలకు విడిపోవడాన్ని కోర్టులు ప్రశ్నించడం గతంలో చూశాం.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా సుప్రీం కోర్టులో బాబు కేసుపై విచారణ జరుగనుంది. అయితే, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది.