స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా సుప్రీం కోర్టులో బాబు కేసుపై విచారణ జరుగనుంది. అయితే, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్…