42 శాతం బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..
రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు..
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం..
BC Reservation Case: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు.. అయితే, హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర సర్కార్.. ఈ మేరకు సోమవారం దాదాపు 50 పేజీలకుపైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులోని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది..అయితే, 42 శాతం బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపు జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనుంది.. కోర్టు నంబర్ 3లో 49వ కేసుగా లిస్ట్ చేయబడింది.. అయితే, వచ్చే వారం సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉన్న నేపథ్యంలో.. త్వరితగతిన ఈ వారమే లిస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.. దీంతో, రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రాబోతోంది.. దీంతో, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలాంటి వాదనలు కొనసాగనున్నాయి.. అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..