Supreme Court: “వారం రోజుల్లో సమాధానం చెప్పాలి” వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు
- వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
- వారం రోజుల గడువు కోరిన కేంద్ర ప్రభుత్వం
- వక్ఫ్ బోర్డులో ఎలాంటి మార్పులు చేయవద్దన్న సుప్రీం
- వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం గడువు ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి మార్పు చేయవద్దని.. వక్ఫ్ ,వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వారం రోజులకు తదుపరి విచారణ చేపట్టనుంది.
READ MORE: Shivangi : ఎలాంటి అప్ డేట్ లేకుండా.. సైలెంట్ గా OTT లోకి ‘శివంగి’
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
కాగా.. నిన్న(బుధవారం) కూడా వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం విచారణ నిర్వహించింది. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో.. ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్-అఫీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇకపై హిందూ మత ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!