సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు వచ్చాయి… ఆ తర్వాత మిలాద్ ఉన్ నబీ సెలవులు కూడా ఉండడంతో ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు మూతపడనుంది.. అయితే, శనివారం నుంచే సెలవులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక, 17న ఆదివారం, 18, 19 తేదీల్లో మిలాద్ ఉన్ నబీ సెలవులు ఉండడంతో.. సుప్రీంకోర్టు…
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…
ఢిల్లీ : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని…జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా…
లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్…
రాజస్తాన్ లో ఎవరిపైనైనా కోపం పగ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ తరువాత పాము కాటుతో చనిపోయినట్టు చిత్రీకరిస్తూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కోనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ధర్మాసం పేర్కొన్నది. దీనిపై ధర్మాసనం సీరియస్ అయింది. రాజస్థాన్లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మహిళ కుమారులిద్దరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సచిన్కు అల్ఫాన్సా అనే యువతితో 2018 డిసెంబర్ 18…
లఖింపూర్ ఘటనపై రైతులు మండిపడుతున్నారు. అటు, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లఖింపూర్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. అయితే, లఖింపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నది. సీబీఐ చేత విచారణ చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు…
నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్నే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. పరీక్ష నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై మండిపడింది… పాత సిలబస్ ప్రకారం టెస్ట్ నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు…
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస దురదృష్టకరమని సోమవారం విచారం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని విచారం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన (సత్యాగ్రహం ) నిర్వహించడానికి అనుమతి కోరుతూ “కిసాన్ మహాపంచాయత్” దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే లఖింపూర్ ఖేరి లాంటి సంఘటనలు నిరోధించేందుకు, ఏలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతించరాదని కేంద్రం తరఫున హాజరైన…
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని,…