Siddique Kappan: సిద్ధిఖీ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court grants bail to Kerala journalist Siddique Kappan: కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020 నుంచి జైలులోనే ఉన్నాడు సిద్ధిఖీ కప్పన్. ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్ధిఖీ కప్పన్. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్చ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ ఆరువారాల పాటు ఢిల్లీలో, ఆ తరువాత కేరళ పోలీసులకు రిపోర్టు చేస్తారని తీర్పు చెప్పింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ సామూహిక అత్యాచార కేసును రిపోర్టు చేసేందుకు వెళ్తున్న క్రమంలో సిద్ధిఖీ కప్పన్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై యూఏపీఏ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మలయాళ వార్తా పోర్టర్ అజీముఖం రిపోర్టర్ సిద్ధికీ కప్పన్‌కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అయితే దీనితో సుప్రీంకోర్టు ఏకీభవిచలేదు. తాను నిర్దోషినని.. అక్రమంగా ఇరికించబడ్డానని సుప్రీంకోర్టులో వాదించారు కప్పన్.
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
అల్లర్లను ప్రేరేపించడానికి సిద్ధిఖీ కప్పన్‌కు పీఎఫ్ఐ డబ్బు చెల్లించిందని.. అతను గుర్తింపు పొందిన జర్నలిస్టు కాదని.. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. కప్పన్ అల్లర్లను సృష్టించడానికి, పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వాదించింది. కప్పన్ పీఎఫ్ఐకి చెందిన వాడని.. అది ఉగ్రవాద సంస్థ అని యూపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదించారు. కాగా.. కప్పన్ కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కప్పన్ వద్ద ఏం దొరికాయి.. అతని వద్ద పేలుడు పదార్థాలు కానీ, ఇతర మెటీరియల్ కనుగొనబడలేదని, ఏ రకమైన ప్రచారానికి ఉపయోగించలేదని సీజేఐ జస్టిస్ లలిత్ అన్నారు.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?