కరూర్ తొక్కిసలాట ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ టీవీకే అధినేత, నటుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం ధర్మాసనం కీలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.
Tirupati Laddu Row: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీఐ డీఐజీ మురళీ రాంబా తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకుని సీబీఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.
దేశ వ్యాప్తంగా కుక్కల బెడద పెరిగిపోయింది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా మనుషులపై కుక్కల గుంపు దాడులు చేయడంతో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
Prabhakar Rao : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్‌లోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట సోమవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో అనేకమంది ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని..…
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు.. ఈనెల 5వ తేదీలోగా హైదరాబాద్‌కు వస్తున్నట్లు పేర్కొన్నాడు..హైదరాబాద్‌కు చేరుకున్న మూడు రోజులు తర్వాత విచారణ అధికారుల ఎదుట హాజర అవుతారని చెప్పారు.. సంబంధించి ప్రాసెస్ ప్రారంభమైనట్లు అనుచర వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆర్టీసీ ప్రమాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆర్థిక కష్టాలతో కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం సమాప్తమైంది. విమానయాన సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది
Today (11-02-23) Business Headlines: బెల్జియం, తెలంగాణ ఒప్పందం: లైఫ్ సైన్సెస్ రంగంలో బెల్జియంకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. బెల్జియం దేశంలోని ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో సుమారు 350 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. బయోఏషియా-2023కి ఫ్లాండర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ పార్ట్నర్. ఈ నేపథ్యంలో ఫ్లాండర్స్ ఇన్వెస్ట్’మెంట్ అండ్ ట్రేడ్’తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది. తద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోనుంది.