Supreme Court: ఆర్టీసీ ప్రమాదంపై సంచలన తీర్పు.. బాధిత కుటుంబానికి రూ.9 కోట్లు ఇవ్వాలని ఆదేశం
- ఆర్టీసీ ప్రమాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- బాధిత కుటుంబానికి రూ.9 కోట్లు ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆర్టీసీ ప్రమాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఇది కూడా చదవండి: Aghathiyaa: అంతుచిక్కని రహస్యంతో ‘అఘత్యా’ ట్రైలర్..
Also Read
అమెరికా పౌరసత్వం కలిగిన లక్ష్మీ నాగళ్ల అనే మహిళ 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మీ నాగళ్ల మృతి చెందింది. అయితే ఆమె మరణంపై భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. అమెరికాలోనే కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి.. అక్కడే తన భార్య నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త కోరారు. వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం రూ.5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా.. రూ.9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi : భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు