Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Actor Darshan: రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్మన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్మన్ మంగళవారం కోర్టను తనకు ‘‘విషం ఇవ్వాలి’’ అని కోరారు. తాను రోజుల తరబడి సూర్యకాంతిని చూడలేదని చెప్పారు.
Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని "చట్టవిరుద్ధ సంఘం"గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Nimisha priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గర అవుతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఐదోసారి విచారణకు హాజరయ్యారు. బుధవారం (జూన్ 19) ఆయనను సిట్ అధికారులు సుమారు 9 గంటలపాటు విచారించారు. అయితే ఈ విచారణలో ప్రభాకర్ రావు పలు కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. దీంతో సిట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ సీరియస్‌గా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు…
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఈ వారెంట్‌ను విడుదల చేసింది. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జారీ అయ్యింది. ఈ పరిణామాలతో ప్రభాకర్ రావు శనివారం భారత్‌కు బయలుదేరి, జూన్ 8 అర్థరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. వెంటనే…
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని…
Kancha Gachibowli: తెలంగాణలో గచ్చిబౌలి భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) ఒక కీలక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు, సిఫార్సులతో పాటు పర్యావరణం, అడవుల పరిరక్షణపై గాఢమైన దృష్టిని వెల్లడించింది. గచ్చిబౌలి భూముల్లో అటవీ లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేసిన సీఈసీ, తుది నివేదిక కోసం అటవీ సర్వే అనంతరం నాలుగు వారాల గడువు కోరింది. సీఈసీ నివేదిక ప్రకారం, హైకోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు గచ్చిబౌలి…
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలను జీవితాంతం అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 6 సంవత్సరాలు మాత్రమే ఎన్నికల్లో…