Supreme Court: ఉగ్ర సంస్థ ‘‘సిమి’’ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- ఉగ్రసంస్థ సిమిపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్..
- పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని “చట్టవిరుద్ధ సంఘం”గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) ట్రిబ్యునల్ జూలై 24, 2024న ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సిమిపై నిషేధాన్ని 5 ఏళ్లు పొడగించాలని కేంద్రం జనవరి 29, 2024లో నిర్ణయించిన తర్వాత యూఏపీఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. సిమిని నిషేధిత సంస్థగా ప్రకటించడానికి తగిన కారణం ఉందా లేదా అనే దానిపై తీర్పు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేశారు.
Also Read
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
సిమిని మొదటిసారిగా సెప్టెంబర్ 2001లో నిషేధించారు. నేటికి ఆ నిషేధం కొనసాగుతోంది. నిషేధాన్ని చివరసారిగా 2024లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా పొడిగించారు. ఈ సంస్థ ఉగ్రవాదానికి, మత విద్వేశాన్ని పెంచిపోషిస్తోందని, సామస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
సిమి పిటిషనర్ తరుపున వాదిస్తున్న న్యాయవాది, ఇప్పటికే 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ సిమి మాజీ సభ్యుడని చెప్పినప్పుడు, ‘‘ అయితే మీరు ఎందుకు వచ్చారు..? సంస్థనే రానివ్వండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ ఉనికిలో లేదని న్యాయవాది కోర్టుకు తెలియజేసినప్పుడు, ‘‘ అప్పుడు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?’’ అని అడిగింది. జమైత్-ఇ-ఇస్లామి-హింద్ (జెఇఐహెచ్)పై విశ్వాసంతో యువత మరియు విద్యార్థుల ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా సిమిని ఏప్రిల్ 25, 1977న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో స్థాపించారు. అయితే, ఆ సంస్థ 1993లో ఒక తీర్మానం ద్వారా తనను తాను స్వతంత్రంగా ప్రకటించుకుంది.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!