టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ (15,921) అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు. దాదాపు దశాబ్దకాలం గడిచినా, ఎవ్వరూ దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. మధ్యలో కొందరు యువ ఆటగాళ్లు ప్రదర్శించిన అద్భుత ఆటతీరుని చూసి, బహుశా వాళ్లు సచిన్ రికార్డ్‌ని అధిగమిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఫామ్ కోల్పోయి సచిన్ రికార్డ్‌కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ విషయంలోనూ రిపీట్ కావొచ్చని బ్యాటింగ్ దిగ్గజం సునీల్…
భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది…
ఐపీఎల్ టోర్నమెంట్ ముగియడంతో.. ఇప్పుడు అందరి దృష్టి సౌతాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే మాజీలందరూ ఈ సిరీస్‌పై తమతమ అంచనాల్ని వెల్లడించడం మొదలుపెట్టారు. ఏ జట్టు సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది? టీమిండియాలో ఎవరు బాగా రాణించగలరు? ఎవరెవరు ఏయే స్థానాల్లో దిగితే బాగుంటుంది? అనే విషయాలపై తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషభ్ పంత్,…
కామెంటరీలో తమ ప్రత్యేకత చాటుకోవాలని.. పంచ్‌లు, ప్రాసలతో ఆకట్టుకోవాలన్న మోజులో కొందరు దిగ్గజాలు హద్దు మీరుతున్నారు. క్రికెట్‌పై తమకున్న అనుభవాన్ని రంగరించి, వాక్చాతుర్యంతో రక్తి కట్టించాల్సిన వీళ్ళు.. వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకరు. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కామెంట్ చేయబోయి, అతని భార్య అనుష్క శర్మ పేరుని ప్రస్తావించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు మరోసారి హెట్మెయర్,…
ఈ ఏడాది ఐపీఎల్లో దినేశ్ కార్తీక్ ఎలా చెలరేగిపోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా.. ఎన్నో మెరుపులు మెరిపించాడు. చాలాసార్లు జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని రౌద్ర రూపం దాల్చి, మైదానంలో తాండవం చేస్తున్నాడు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే.. కార్తీక్‌ను తిరిగి టీమిండియాలో తీసుకోవాల్సిందిగా మద్దతులు లభిస్తున్నాయి. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి.. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను…
ఐపీఎల్ సంబరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో ఐపీఎల్ జరగనుంది. దీంతో ఈ ఏడాది ట్రోఫీ ఎవరు గెలుస్తారు అన్న చర్చ మొదలైంది. టైటిల్ ఫేవరేట్స్‌గా చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో కొత్తగా దిగుతున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్…
షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి సమయంలో టీవీ ఛానల్ వారు అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. తాను జవాబు చెప్పాల్సింది కాదని వివరించాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా తన అభిప్రాయం చెప్పినట్లు సన్నీ తెలిపాడు. క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో…
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియా చేసిన ప్రయోగాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించి… వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపడం సరికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించి ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. రోహిత్‌తో పంత్‌ను ఓపెనింగ్ పంపడం చివరి ఆప్షన్‌గానే…
జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్ ఎల్గార్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ…
టీమిండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరబోతున్నాడు. టెస్టు కెరీర్లో అతడు వందో టెస్టును ఆడనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్ట్ ఆడితే 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ… సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో 100వ టెస్టు మజిలీకి చేరుకోనున్నాడు. ఆ టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సుదీర్ఘ కాలంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సేవలు అందిస్తున్న కోహ్లీ… తన వందో టెస్టును బెంగళూరులో…