Solar Storm: రెండు దశాబ్ధాలకు పైగా సంభవించిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫానుల్లో ఒకటిగా శుక్రవారం భూమిని తాకింది. దీని వల్ల శాటిలైట్లు, పవర్ గ్రిడ్‌లకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) యొక్క స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ప్రకారం, కరోనల్ మాస్ ఎజెక్షన్(CMEs) సూర్యుడి నుంచి ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల రూపంలో ఎగిసిపడినట్లు తెలిపింది. ఇది తీవ్రమైన ‘‘భూ అయస్కాంత తుఫాను’’ను ప్రేరేపించింది. అక్టోబర్ 2003లో ఏర్పడిన జియో మాగ్నెటిక్ స్ట్రోమ్ కారణంగా స్వీడన్‌లో బ్లాక్ అవుట్ నెలకొంది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ మౌళిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. రాబోయే మరికొన్ని రోజుల్లో ఇలాంటి మరిన్ని CMEs భూమిని ఢీకొడుతాయని శాస్త్రవేత్తుల భావిస్తున్నారు. సూర్యుడి నుంచి ఎగిసి పడే సౌర జ్వాలలు కాంతివేగంతో ప్రయాణించి 8 నిమిషాల్లోనే భూమిని చేరుతాయి. అయితే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మాత్రం సెకన్‌కి 800 కిమీమీటర్ల వేగంగతో నిశ్చలంగా ప్రయాణిస్తాయి.
Read Also: Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 200 మంది మృతి
సూర్యుడి నుంచి ఎగిసి పడే CMEs మన గ్రహంతో పోలిస్తే 17 రెట్లు వెడల్పైన భారీ సన్‌స్పాట్ క్లస్టర్ నుంచి ఉద్భవించాయి. ప్రస్తుతం సూర్యుడు తన జీవితంతో 25వ ‘‘సౌరచక్రం’’లో ఉన్నాడు ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్‌స్పాట్స్ ఏర్పడుతుంటాయి. వీటి నుంచి ఒక్కసారిగా పేలుళ్లు జరిగి అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది. ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
అయితే, భూమికి ఉండే వాతావరణం విశ్వం నుంచి వచ్చే అనేక ఆవేశిత కణాల నుంచి భూమిని రక్షిస్తోంది. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే సౌరజ్వాలలు, సౌర తుఫానులను భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. ప్రమాదకరమైన కిరణాలు భూమిని తాకకుండా కాపాడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే సందర్భంలో పవర్ ఫుల్ మాగ్నిటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఇది భూమి చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇలా సౌర తుఫానులు భూమిని తాకగానే భూ అయస్కాంత తుఫానులు(జియోమాగ్నెటిక్ స్ట్రోమ్స్) ఏర్పడుతాయి. ధృవాల వద్ద అరోరాలు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం కమ్యూనికేషన్ వ్యవస్థ, శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.