దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలు తమ చిన్నారులకు ప్రైవేట్ మందులను వాడటాన్ని గమనించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. నగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను హరీశ్ రావ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వస్తూనే నేరుగా వార్డులన్నీ కలియతిరిగారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులు, వారి సహాయకులతో ఆరాతీశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తుంటే పేద రోగులకు ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకువచ్చేందుకు ఎందుకు రాస్తున్నారని…
చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. దీంతో క్రమంగా మంటలు షాప్ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది…