చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. దీంతో క్రమంగా మంటలు షాప్ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు.
ఫైర్ ఇంజన్ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే.. షాట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, కానీ.. ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఎంత మేరక ఆస్తి నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నామన్నారు.
LIVE: ఈ రోజు శ్రీ సాయి చాలీసా పారాయణం చేస్తే అనుకోని రూపంలో సహాయం
కాగా.. భాగ్యనగరంలోని సుల్తాన్‌బజార్‌లో మే 17 2022న (మంగళవారం) ఉదయం ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వస్త్రం దుకాణం మొత్తం పెద్దగా పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.