Big Breaking: దేశంలోని ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ అట్లాస్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ మంగళవారం (సెప్టెంబర్ 3) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం విచారణ జరుపుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Minister Ponguleti: ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాం..
అట్లాస్ సైకిల్ మాజీ అధ్యక్షుడు సలీల్ కపూర్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం లేన్ లోని తన నివాసంలో ఉన్నట్లు ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం కేసు దర్యాప్తు చేస్తోంది. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమంది వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించినట్లు సమాచారం.
Crime News: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్
సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సలీల్ కపూర్ తన మూడు అంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో శవమై కనిపించాడు. కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని పూజ గది దగ్గర రక్తంలో తడిసిన కపూర్ మృతదేహాన్ని గుర్తించారు. అతడిని ఎయిమ్స్‌కు తరలించగా, అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి నేరస్థలాన్ని సందర్శించి వేలిముద్రలు వెలికితీశారు.