మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురి అయ్యి ఉరివేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలిపిన పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తరచూ విధి మధ్య గొడవలు కావడంతో భార్య దూరంగా ఉంటుంది. రహీం శ్రీశైలం వాసి. శ్రీశైలంలో ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 498 కేసు కూడా నడుస్తుంది.
READ MORE: Minister Sridhar Babu Counter: ట్విట్టర్ లో కేటీఆర్ కామెంట్స్.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
గొడవల కారణంగా భార్య అరవిందు ఫార్మసీలో లేబర్ పని చేసుకుంటూ ఓ ప్రవేట్ హాస్టల్లో ఉంటుంది. తన భార్యకు కనబడేలా హాస్టల్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రహీం.. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసుల ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.