ఈ వారం గట్టిగానే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి, రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర. అలాగే మసూద ఫేమ్ తిరువీర్ నటిస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వాస్తవానికి ఈ మూడు సినిమాలలో నలుగురికి ఈ శుక్రవారం చాలా కీలకం. రష్మిక: అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే, ముందుగా…
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గట్టు కాకుండా, తనకిష్టమైన విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా “జటాధర” ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, దైవిక అంశాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో కూడా, సుధీర్ మాత్రం ఈ కథను ట్రెండ్ కోసం కాకుండా, కంటెంట్ బలం కోసం ఎంచుకున్నానంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. “ఇప్పుడున్న ట్రెండ్ రెండేళ్ల తర్వాత…
వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో నవదలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సినిమాని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై శివిన్ నారంగ్ నిర్మించారు. జటాధర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో…
Sudheer Babu New Movie Updates: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న సుధీర్ బాబు.. ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా.. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత…
Sudheer Babu: గత కొన్నేళ్లుగా నైట్రో స్టార్ సుధీర్ బాబు విజయం కోసం బాగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను.. ప్రయోగాలను చేస్తున్నా.. విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా నిరాశ పడకుండా విక్రమార్కుడిలా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు.