వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో నవదలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సినిమాని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై శివిన్ నారంగ్ నిర్మించారు. జటాధర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: CWC 2025: వన్డే ప్రపంచకప్ విజేత భారత్‌కు భారీ డబ్బు.. 39+51 కోట్లు!
‘సుధీర్ బాబు అంటే ఎవరు?.. అని నన్ను నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నా. కృష్ణ గారి అల్లుడు.. మహేష్ బాబు గారి బావ అని అందరికీ తెలుసు. వాటిని నేను గర్వంగా ఒప్పుకుంటున్నా. ఇలా పబ్లిక్ ప్లాట్ ఫామ్‌లో నిజాలు ఇప్పుడుకోవాలి అంటే గట్స్ ఉండాలి. నవంబర్ 7న అందరూ సిద్ధంగా ఉండండి. ఓ మంచి సినిమా, ఓ కొత్త కథ, ఇంటెన్సివ్, ఫామిలీ డ్రామా, శివ తాండవం.. రకరకాల లెయర్స్ ఉంటాయి. కార్తికేయ సినిమాలో కృష్ణుడి గురించే చెప్పే ఎపిసోడ్ మాదిరి.. జటాధరలో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అరుణాచలం వెళ్లే వారు ఈ సినిమాకి ఇంకా కనెక్ట్ అవుతారు. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం అందుకుంటాం’ అని సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.