Sudheer Babu New Movie: సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు.. భారీ బడ్జెట్, పాన్ ఇండియా లెవల్లో ప్లాన్!
- నవ దళపతిగా సుధీర్ బాబు
- సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో సుధీర్
- దర్శకుడిగా వెంట్ కళ్యాణ్ పరిచయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer Babu New Movie Updates: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న సుధీర్ బాబు.. ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా.. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత ఉంటుంది. ఈ చిత్రంతో వెంట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జూన్ 14న విడుదలైన హరోంహర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్‌గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అందులో యాక్షన్ సన్నివేశాలు, కథనంకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. రుస్తుం, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు చేయబోతున్న చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. త్వరలోనే మేకర్స్ ఆ వివరాలను తెలియజేయనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు. ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఇది వెలికి తీస్తుంది. సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు.
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
Also Read: Team India Coach: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎంపిక.. కీలక అప్‌డేట్ ఇచ్చిన జై షా!
సుధీర్ బాబు మాట్లాడుతూ… ‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!