తెలుగు పాటకు వెలుగుబాటలు చూపిన వారెందరో! వారిలో ప్రజాకవులది ప్రధాన పాత్ర. సుద్దాల హనుమంతు పాట తెలుగునేలను పులకింప చేసింది. ప్రజాకవిగా ఆయన సాగిన తీరును ఈ నాటికీ గుర్తు చేసుకొనేవారెందరో! హనుమంతు తనయుడు అశోక్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక చిత్రసీమలోనూ తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలచిన తెలుగు సినిమా కవి…
తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే వందలాది పాటలు రాసి, పరవశింపచేసిన సుద్దాల…