Suddala Ashok Teja: తెలుగు సినీ సాహితీవనంలో అశోక తేజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు పాటకు వెలుగుబాటలు చూపిన వారెందరో! వారిలో ప్రజాకవులది ప్రధాన పాత్ర. సుద్దాల హనుమంతు పాట తెలుగునేలను పులకింప చేసింది. ప్రజాకవిగా ఆయన సాగిన తీరును ఈ నాటికీ గుర్తు చేసుకొనేవారెందరో! హనుమంతు తనయుడు అశోక్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక చిత్రసీమలోనూ తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలచిన తెలుగు సినిమా కవి సుద్దాల అశోక్ తేజ! ‘నేను సైతం…’ అంటూ శ్రీశ్రీ పల్లవించిన తీరునే అనుసరిస్తూ ‘ఠాగూర్’ సినిమా కోసం సుద్దాల అల్లిన పదబంధాలు ఆయనకు ఉత్తమ గీత రచయితగా నేషనల్ అవార్డును సంపాదించి పెట్టాయి. ఈ నాటికీ చిత్రసీమలో ‘నేను సైతం…’ అంటూ తనదైన బాణీ పలికిస్తున్నారు సుద్దాల అశోక్ తేజ.
సుద్దాల హనుమంతు, జానకమ్మ దంపతులకు 1959 మే 16న అశోక్ తేజ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నచందాన హనుమంతు కడుపున పుట్టిన అశోక్ తేజకు కూడా చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. బాల్యంలోనే పాటలు రాస్తూ వాటిని రాగయుక్తంగా పాడుతూ తిరిగేవాడు అశోక్. తరువాత మాతృభాషలో పట్టుసాధించి, పంతులుగా వృత్తి సాగించారు. మెట్ పల్లిలో సుద్దాల అశోక్ తేజ టీచర్ గా పనిచేశారు. సుద్దాల అశోక్ తేజ సోదరి తనయుడు ప్రముఖ నటుడు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో ఉత్తేజ్ నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు. అదే తీరున ఉత్తేజ్ కు దర్శకుడు కృష్ణవంశీతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో తన మేనమామలోని కవిని కృష్ణవంశీకి పరిచయం చేశారు ఉత్తేజ్. కృష్ణవంశీ అశోక్ తేజను ప్రోత్సహించారు. తరువాత దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి సీనియర్ డైరెక్టర్స్ సైతం అశోక్ తేజకు అవకాశాలు కల్పించారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ అశోక్ తేజ వినియోగించుకున్నారు. తనదైన పదాలతో పాటలు పలికించారు. ఈ మధ్యకాలంలో ‘ట్రిపుల్ ఆర్’లో సుద్దాల అశోక్ తేజ రాసిన “కొమురం భీముడో…” పాట విపరీతమైన ఆదరణ పొందింది. అందులో ఆ నాటి తెలంగాణ పదాలను చొప్పించిన తీరును చూసి, ఎంతోమంది సాహితీప్రియులు సుద్దాల అశోక్ తేజకు జేజేలు పలికారు. దాసరి దర్శకత్వంలో రూపొందిన “కంటే కూతుర్నే కను, మేస్త్రి” చిత్రాల ద్వారా ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్నారు సుద్దాల అశోక్ తేజ. ఇక చిరంజీవి ‘ఠాగూర్’లో “నేను సైతం…” అంటూ సాగే పాటతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నిలిచారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన సుద్దాల అశోక్ తేజ, ఇప్పటికీ తన చెంతకు చేరిన అవకాశానికి తగ్గ పదాలను అందించాలనే తపిస్తూ ఉంటారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..