రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్‌కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.
గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల పరీక్ష ఫలితాలలో దారుణమైన తప్పిదం వివాదానికి దారితీసింది. దాంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ యొక్క సమగ్రత గురించి ఆందోళనలను పెంచింది. నాలుగో తరగతి చదువుతున్న వాన్షిబెన్ మనీష్భాయ్ తన రిజల్ట్ షీట్ ను అందుకుని రెండు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె గుజరాతీలో 200 కి 211 మార్కులు సాధించగా, అలాగే గణిత స్కోర్ షీట్ 200 కి 212 మార్కులు చూపించింది. Also Read:…
హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు 29 ఏళ్ల స్వాతిగా గుర్తించారు. రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం…
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అనేక రకాల వీడియోలు, మెయిన్ గా మీమ్స్ వైరల్ గా మారడం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. వీటిలో కొన్ని ఆలోచించేలా ఉంటే.. మరికొన్ని క్రియేటివిటితో కూడుకొని మంచి ఫన్ కలిగించేలా ఉంటాయి. అంతేకాదు.. వాటిని కామెంట్ చేయడంలోనూ నెటిజెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే ఓ విద్యార్థి రాసిన కళాఖండాన్ని ఉపాధ్యాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఇందుకు…
ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి మనకు తెలిసింది. పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మరీ పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా విద్యార్థులను గుండెపోట్లు సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు నిద్రలేమి కారణంగానో.. మరో ఒత్తిడి కారణంగా తెలియదు కానీ., విద్యార్థులని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. Also Read: Skill…
Telangana Student Died in US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పిట్టల వెంకట రమణ (27) మరణించాడు. మార్చి 9వ తేదీన విస్టిరీయా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్‌లో వెంకట రమణ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. వెంకట రమణ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు కారణాలతో ఎనిమిది మంది…
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు…
హర్యానాలోని పాల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తన తల్లి, సోదరిని వేధిస్తున్న ముగ్గురు దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 10వ తరగతి విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పల్వాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికొ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థి లోకేష్‌గా గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తెలంగాణలోని భువనగిరి సాంఘీక వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా.. అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.