ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అనేక రకాల వీడియోలు, మెయిన్ గా మీమ్స్ వైరల్ గా మారడం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. వీటిలో కొన్ని ఆలోచించేలా ఉంటే.. మరికొన్ని క్రియేటివిటితో కూడుకొని మంచి ఫన్ కలిగించేలా ఉంటాయి. అంతేకాదు.. వాటిని కామెంట్ చేయడంలోనూ నెటిజెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే ఓ విద్యార్థి రాసిన కళాఖండాన్ని ఉపాధ్యాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Rapido Cab Services: ‘ఓకే చలో’ యాప్ సేవలు.. క్యాబ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం..!
మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు పరీక్ష రాస్తున్న సమయంలో ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఏదో ఒక కథ రాయడం.. లేకపోతే ప్రశ్నకు సంబంధంలేని సమాధానం రాయడం చేస్తూ ఉంటాం. మరికొందరైతే చిత్ర విచిత్రమైన సమాధానాలు రాసి ప్రశ్నాపత్రాలు దిద్ది టీచర్స్ కి షాక్ కు గురి చేస్తారు. అలాంటి పని ప్రస్తుతం ఓ జాతిరత్నం చేశాడు. ఇంతకీ అసలు ఏం చేశాడంటే.. ఈ ఆణిముత్యం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కు తేడా ఏంటి అని ప్రశ్న పత్రంలో రాగా.. అందుకుగాను విద్యార్థి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం రాశాడు. అసలు ఇందుకు సంబంధించి విద్యార్థి ఏం రాసాడు అంటే..
Also read: IPL 2024 MI vs RR: ఈసారైనా ‘ముంబై’ బోణి కొట్టేనా..?
హార్డ్వేర్ అంటే హార్డ్ అట.. సాఫ్ట్వేర్ ఏమో సాఫ్ట్ అట. హార్డ్వేర్ అనేది విభిన్నమైనది అట.. సాఫ్ట్వేర్ కూడా డిఫరెంట్ అట. ఇంకో పాయింట్ లో హార్డ్వేర్ అనేది సాఫ్ట్ కాదట.. అలానే సాఫ్ట్వేర్ అనేది హార్డ్ కాదంట. ఈ విధంగా విద్యార్ధి తనకు తోచిన విధంగా వెరైటీ సమాధానంతో పేపర్ నింపేశాడు. కొన్ని సమయాలలో టీచర్లు పేపర్లు దిద్దేటప్పుడు ఓవర్ లుక్ లో తప్పు రాసినా మార్క్స్ వేసేస్తూ ఉండటం సహజం. అలా భావించి ఏదో ఒక పాస్ మార్క్స్ వేసేస్తారులే అనుకున్నాడేమో ఈ ఆణిముత్యం. మొత్తానికి అతడు రాసిన సమాధానం ట్రేండింగ్ లో ఉంది.
The best answer to the question on " What is the difference between #hardware and #software?", written by a brilliant student😂🤣 pic.twitter.com/jD6EDSOcSO
— Dr.G.R.Raghavender🕉🇮🇳(Modi Ka Parivar) (@GR_Raghavender) July 2, 2022